కీర్తన 68:28-35

కీర్తన 68:28-35 IRVTEL

నీ దేవుడు నీకు బలం ఇచ్చాడు. దేవా, గతంలో చేసినట్టు నీ శక్తిని మాకు కనపరచు. యెరూషలేములోని నీ ఆలయాన్నిబట్టి రాజులు నీ దగ్గరికి కానుకలు తెస్తారు. జమ్ముగడ్డిలోని మృగాన్ని, ఆబోతుల గుంపును, దూడల్లాంటి జాతులను ఖండించు. వారు నీకు లోబడి శిస్తుగా వెండి కడ్డీలు తెచ్చేలా వారిని గద్దించు. యుద్ధాలు కోరుకునే వారిని చెదరగొట్టు. ఈజిప్టు నుండి రాకుమారులు వస్తారు. ఇతియోపియా దేవుని వైపు తన చేతులు చాచి పరిగెత్తి వస్తుంది. భూరాజ్యాలన్నీ దేవుని గూర్చి పాడండి. ప్రభువును కీర్తించండి. అనాది కాలం నుండి ఆకాశాలపై స్వారీ చేసే ఆయనను కీర్తించండి. ఆయన తన స్వరం వినిపిస్తాడు. అది బలమైన స్వరం. దేవునికి బలాతిశయం ఆపాదించండి. ఆయన మహిమ ఇశ్రాయేలు మీద ఉంది. ఆయన బలం అంతరిక్షంలో ఉంది. దేవా, నీ పరిశుద్ధ స్థలాల్లో నువ్వు భీకరుడివి. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల ప్రభావాలను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగు గాక.