యెహోవా, నాకు విరోధంగా పనులు చేస్తున్న వారికి విరోధంగా ఉండు. నాతో పోరాటం చేసే వాళ్ళతో నువ్వు పోరాటం చెయ్యి. నీ చిన్న డాలునూ, నీ పెద్ద డాలునూ పట్టుకో. లేచి నాకు సహాయం చెయ్యి. నన్ను తరిమే వాళ్ళకు విరోధంగా ఈటెనూ, గొడ్డలినీ ప్రయోగించు. నీ రక్షణ నేనే అని నాకు అభయమివ్వు. నా ప్రాణం తీయాలని చూసేవాళ్ళు సిగ్గుపడి అవమానం పాలవుతారు గాక! నాకు హాని చేయాలని చూసే వాళ్ళు వెనక్కి తగ్గి గందరగోళానికి గురౌతారు గాక! యెహోవా దూత వాళ్ళను తరుముతుంటే వాళ్ళు వీస్తున్న గాలి ఎదుట ఎగిరిపోయే పొట్టులాగా ఉంటారు గాక! యెహోవా దూత వాళ్ళను తరుముతుంటే వాళ్ళు వెళ్ళే దారి చీకటిగానూ జారుడుగానూ ఉంటుంది గాక! కారణం లేకుండానే వాళ్ళు నన్ను పట్టుకోడానికి వల వేశారు. కారణం లేకుండానే వాళ్ళు నా ప్రాణం తీయాలని నా కోసం గుంట తవ్వారు. వాడి పైకి వాడికి తెలియకుండా వాణ్ణి విస్మయానికి గురి చేస్తూ నాశనం రానీ. వాళ్ళు వేసిన వలలో వాళ్ళనే పడనీ. తమ స్వనాశనం కోసం వాళ్ళనే దానిలో పడనీ. అయితే నేను యెహోవాలో ఆనందిస్తూ ఉంటాను. ఆయన ఇచ్చే రక్షణలో సంతోషిస్తూ ఉంటాను. అప్పుడు నా శక్తి అంతటితో నేనిలా అంటాను. యెహోవా, నువ్వు అణచివేతకు గురైన వాళ్ళను బలవంతుల చేతిలో నుండీ, పేదలనూ, అవసరార్థులనూ దోచుకునే వాళ్ళ చేతిలో నుండీ విడిపిస్తావు. నీలాటి వారెవరు?
చదువండి కీర్తన 35
వినండి కీర్తన 35
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తన 35:1-10
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు