న్యాయాధి 2:1-3

న్యాయాధి 2:1-3 IRVTEL

యెహోవా దూత గిల్గాలు నుంచి బయలుదేరి బోకీముకు వచ్చి ఇలా అన్నాడు “నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించి, మీ పితరులకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని చేర్చాను. మీతో చేసిన నిబంధన నేనెప్పుడూ నిరర్ధకం చేయను. మీరు ఈ దేశవాసులతో సంధి చేసుకోకూడదని, వాళ్ళ బలిపీఠాలు విరుగగొట్టాలని ఆజ్ఞ ఇచ్చాను గాని మీరు నా మాట వినలేదు. మీరు చేసిందేమిటి? కాబట్టి నేను మీ ముంగిట్లో నుంచి వాళ్ళని వెళ్లగొట్టను. వాళ్ళు మీ పక్కలో బల్లేలుగా ఉంటారు. వాళ్ళ దేవుళ్ళు మీకు ఉరిగా ఉంటారని చెప్తున్నాను.”