హోషే 11:1-4

హోషే 11:1-4 IRVTEL

“ఇశ్రాయేలు పసిప్రాయంలో నేను అతనిపట్ల ప్రేమగలిగి, నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలోనుండి పిలిచాను. వారిని ఎంతగా పిలిస్తే బయలు దేవుళ్ళకు వారు అంత ఎక్కువగా బలులు అర్పించారు. విగ్రహాలకు ధూపం వేశారు. ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాణ్ణి నేనే. వారి చేతులు పట్టుకుని పైకి లేపిన వాణ్ణి నేనే. నేనే వారిని పట్టించుకున్నాను అనే సంగతి వారికి తెలియదు. మానవత్వపు బంధంతో వారిని నడిపించాను. స్నేహబంధాలతో తోడుకుపోయాను. వారి పళ్ళ మధ్య నుంచి కాడిని తీసిన వాడిలా నేను వారికి ఉన్నాను. వంగి వారికి అన్నం తినిపించాను.