ఆది 36:20-30

ఆది 36:20-30 IRVTEL

ఎదోము దేశంలో ఆదినుండీ నివసించిన హోరీయుడైన శేయీరు కొడుకులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఎదోము దేశంలోని శేయీరు కొడుకులైన హోరీయుల నాయకులు. లోతాను కొడుకులు హోరీ, హేమాను. లోతాను సోదరి తిమ్నా. శోబాలు కొడుకులు అల్వాను, మానహదు, ఏబాలు, షపో, ఓనాము. సిబ్యోను కొడుకులు అయ్యా, అనా అనేవారు. ఈ అనా తన తండ్రి సిబ్యోనుకు చెందిన గాడిదలను మేపుతూ ఉండగా మొదటి సారిగా అరణ్యంలో ఉష్ణధారలు కనుగొన్నాడు. అనా కొడుకు దిషోను, కూతురు అహొలీబామా. దిషోను కొడుకులు హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను, ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, అకాను. దీషాను కొడుకులు ఊజు, అరాను. హోరీయుల నాయకులు ఎవరంటే, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దీషాను. శేయీరు దేశంలోని వారి నాయకుల జాబితా ప్రకారం వీరు హోరీయుల నాయకులు.

ఆది 36:20-30 కోసం వీడియో