యెహె 40:1-6

యెహె 40:1-6 IRVTEL

మనం బబులోను చెరలోకి వచ్చిన 25 వ సంవత్సరం మొదటి నెల పదో రోజున, అంటే పట్టణం ఆక్రమణకు గురైన 14 వ సంవత్సరం అదే రోజు యెహోవా హస్తం నా మీదకి వచ్చి నన్ను పట్టణానికి తోడుకు పోయాడు. దేవుడు నన్ను తన దర్శనాలతో నింపి ఇశ్రాయేలు దేశంలోకి తెచ్చి, చాలా ఎత్తయిన కొండ మీద ఉంచాడు. దానికి దక్షిణాన పట్టణం లాంటిది ఒకటి నాకు కనబడింది. అక్కడికి ఆయన నన్ను తీసుకెళ్ళాడు. అక్కడ మెరిసే ఇత్తడిలాగా ఉండి, చేతిలో దారం, కొలిచే కర్ర పట్టుకుని నగర ద్వారంలో నిలబడిన ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి నాతో ఇలా అన్నాడు. “నరపుత్రుడా, నేను నీకు చూపేవాటిని కళ్ళారా చూసి, చెవులార విని నీ మనస్సులో ఉంచుకో. వాటిని నీకు చూపడానికే నిన్నిక్కడికి తెచ్చాను. నువ్వు చూసిన వాటన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజెయ్యి.” నేను చూసినప్పుడు మందిరం చుట్టూ ప్రాకారం ఉంది. ఆ మనిషి చేతిలో 3 మీటర్ల 20 సెంటి మీటర్ల కొలకర్ర ఉంది. ఆయన ఆ గోడ కొలతలు చూసినప్పుడు దాని వెడల్పు 3 మీటర్ల 20 సెంటి మీటర్ల ఎత్తు 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఉంది. అతడు తూర్పు గుమ్మానికి వచ్చి దాని మెట్లెక్కి గుమ్మపు గడపను కొలిస్తే అది 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఉంది.

యెహె 40:1-6 కోసం వీడియో