ఎవరైనా ఒకడు తన దాసుణ్ణి, దాసిని చనిపోయేలా కర్రతో కొట్టినప్పుడు అతడు తప్పకుండా శిక్షకు అర్హుడు. అయితే ఆ దాసులు ఒకటి రెండు రోజులు చనిపోకుండా బతికితే ఆ శిక్ష అతనికి ఉండదు. ఎందుకంటే ఆ దాసులు అతని సొమ్ము. ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భస్రావం జరిగితే, గర్భస్రావం కాక మరి ఏ ఇతర హానీ కలగకపోతే ఆ స్త్రీ భర్త హాని కలిగించినవాడిపై మోపిన నష్టాన్ని వాడు చెల్లించాలి. అయితే అది న్యాయాధిపతుల నిర్ణయం మేరకు వాళ్ళ సమక్షంలో జరగాలి. తీవ్రగాయం కలిగినప్పుడు మీరు విధించ వలసిన శిక్షలు: ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు
చదువండి నిర్గమ 21
వినండి నిర్గమ 21
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: నిర్గమ 21:20-24
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు