అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను జీవించి ఉండగా అతని ముందు నిలిచి సేవ చేసిన పెద్దలను పిలిపించి “ఈ ప్రజలకు నన్నేమి జవాబు చెప్పమంటారు? మీ సలహా ఏమిటి?” అని వారిని అడిగాడు. అందుకు వారు “నువ్వు ఈ ప్రజల పట్ల దయాదాక్షిణ్యాలు చూపి వారితో మృదువుగా మాట్లాడితే వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఉంటారు” అని అతనితో చెప్పారు. అయితే అతడు ఆ పెద్దలు తనకు చెప్పిన ఆలోచన తోసిపుచ్చి, తనతో పెరిగి తన దగ్గర ఉన్న యువకులతో ఆలోచన చేశాడు. అతడు “‘నీ తండ్రి మామీద ఉంచిన కాడిని తేలిక చెయ్యి’ అని నన్నడిగిన ఈ ప్రజలకి నేనేం జవాబు చెప్పాలని మీరు ఆలోచిస్తారో చెప్పండి” అని వారిని అడిగాడు. అతనితో కూడా పెరిగిన ఆ యువకులు అతనితో ఇలా అన్నారు “‘నీ తండ్రి మా కాడిని బరువు చేశాడు, నువ్వు దాన్ని తేలిక చెయ్యి’ అని నిన్ను అడిగిన ఈ ప్రజలతో నువ్వేమి చెప్పాలంటే, ‘నా చిటికెన వ్రేలు నా తండ్రి నడుము కంటే బరువు. నా తండ్రి బరువైన కాడి మీమీద మోపాడు గాని నేను మీ కాడిని మరింత బరువు చేస్తాను. నా తండ్రి చెర్నాకోలతో మిమ్మల్ని దండించాడు. నేనైతే మిమ్మల్ని కొరడాలతో దండిస్తాను’ అని చెప్పు.” “మూడవ రోజున నా దగ్గరికి తిరిగి రండి” అని రాజు చెప్పిన ప్రకారం యరొబాము, ప్రజలు మూడో రోజున రెహబాము దగ్గరకి వచ్చారు. రెహబాము పెద్దలు చెప్పిన ఆలోచనను త్రోసిపుచ్చి, యువకులు చెప్పిన ప్రకారం వారితో కఠినంగా జవాబిచ్చాడు. అతడు వారితో “నా తండ్రి మీ కాడిని బరువు చేశాడు, నేను దాన్ని మరింత బరువు చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని చెర్నాకోలతో దండించాడు. నేనైతే మిమ్మల్ని కొరడాలతో దండిస్తాను” అని చెప్పాడు. యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కొడుకు యరొబాముతో చెప్పిన తన మాటను స్థిరపరచేలా దేవుని నిర్ణయ ప్రకారం ప్రజలు చేసిన మనవి రాజు ఆలకించలేదు.
చదువండి 2 దిన 10
వినండి 2 దిన 10
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 2 దిన 10:6-15
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు