రోమా 9

9
1నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు. 2క్రీస్తునందు నిజమే చెప్పు చున్నాను, అబద్ధమాడుట లేదు. 3పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును. 4వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి. 5పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. 6అయితే దేవునిమాట తప్పిపోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు. 7అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని
ఇస్సాకువల్లనైనది నీ సంతానము అనబడును,
8అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచబడుదురు. 9వాగ్దానరూపమైన వాక్యమిదే–
మీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు
శారాకు కుమారుడు కలుగును.
10-12అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగాఉండు నిమిత్తము, పిల్ల లింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే
పెద్దవాడు చిన్నవానికి దాసుడగును
అని ఆమెతో చెప్పబడెను. 13ఇందునుగూర్చి నేను
యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది.
14కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు. 15అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు–
ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల
జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.
16కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని#9:16 మూలభాషలో–పరుగెత్తువాని. వలననైనను కాదు గాని, కరుణించు దేవునివలననే అగును. 17మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను–
నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము
భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు
నిమిత్తమే నిన్ను నియమించితిని.
18కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచగోరునో వాని కఠిన పరచును. 19అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరముమోపనేల అని నీవు నాతో చెప్పుదువు. 20అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా? 21ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా? 22ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్ఛ యించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిన నేమి? 23-24మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, అన్యజనములలోనుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?
25ఆప్రకారము–
నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియు
రాలు కానిదానికి ప్రియురాలనియు, పేరు
పెట్టుదును.
26మరియు జరుగునదేమనగా, మీరు
నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్ప
బడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులనివారికి పేరుపెట్టబడును
అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు.
27మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని 28యెషయాయు ఇశ్రాయేలునుగూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు.
29మరియు యెషయా ముందు చెప్పినప్రకారము–
సైన్యములకు అధిపతియగు ప్రభువు, మనకు సంతా
నము శేషింపచేయకపోయినయెడల సొదొమవలె
నగుదుము, గొమొఱ్ఱాను పోలియుందుము.
30-31అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి; అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు, 32వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి.
33–ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో
సాప్థిచుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు
వాడు సిగ్గుపరచబడడు
అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

రోమా 9: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

రోమా 9 కోసం వీడియో