రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వనిచేయు దము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానముచేయు దము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహా దేవుడు దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు భూమ్యగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వతశిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు దము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీపితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి –వారు హృదయమున తప్పిపోవు ప్రజలువారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి–వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని.
Read కీర్తనలు 95
వినండి కీర్తనలు 95
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 95:1-11
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు