అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి –నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధైతెలముతో అతని నభిషేకించియున్నాను. నా చెయ్యి యెడతెగక అతనికి తోడై యుండును నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువును అతనిమీద జయము నొందడు దోషకారులు అతని బాధపరచరు. అతనియెదుట నిలువకుండ అతని విరోధులను నేను పడగొట్టెదను. అతనిమీద పగపట్టువారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైయుండును. నా నామమునుబట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రముమీద అతనిచేతిని నదులమీద అతని కుడిచేతిని ఉంచెదను. –నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠకుమారునిగాచేయు దును భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగానుండును. శాశ్వతకాలమువరకు అతని సంతానమును ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను.
చదువండి కీర్తనలు 89
వినండి కీర్తనలు 89
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 89:19-29
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు