అరణ్యమునవారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగబడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి. మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధులచేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైననువారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమునువారు జ్ఞిప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండ నైలునది కాలువలను వారి ప్రవాహజలములను ఆయన రక్తముగా మార్చెను ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెనువారి కష్టఫలములను మిడతలకప్పగించెను. వడగండ్లచేత వారి ద్రాక్షతీగెలను హిమముచేత వారి మేడిచెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలుచేసెను.వారి మందలను పిడుగుల పాలుచేసెను. ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారిమీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదునుచేసెను మరణమునుండి వారి ప్రాణమును తప్పింపకవారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమసంతానమును ఆయన సంహరించెను. అయితే గొఱ్ఱెలవలె ఆయన తన ప్రజలను తోడు కొనిపోయెను ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయనవారిని నడిపించెను వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా నడిపించెను.వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను.
చదువండి కీర్తనలు 78
వినండి కీర్తనలు 78
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 78:40-53
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు