కీర్తనలు 75

75
ప్రధానగాయకునికి. అల్‌తష్హేతు అను రాగముమీద పాడదగినది. ఆసాపు కీర్తన. గీతము.
1దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు
చున్నాము
నీవు#75:1 మూలభాషలో–నామము. సమీపముగా నున్నావని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము
నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు.
2నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను
నేనే న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నాను.
3భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు
నేనే దాని స్తంభములను నిలుపుదును. (సెలా.)
4–అహంకారులై యుండకుడని అహంకారులకు నేను
ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
5–కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి
పొగరుపెట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను
ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
6తూర్పునుండియైనను పడమటినుండియైనను
అరణ్యమునుండియైనను హెచ్చుకలుగదు.
7దేవుడే తీర్పు తీర్చువాడు
ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును
8యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది
అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది
సంబారముతో నిండియున్నది
ఆయన దానిలోనిది పోయుచున్నాడు
భూమిమీదనున్న భక్తిహీనులందరు మడ్డితోకూడ
దానిని పీల్చి మ్రింగివేయవలెను.
9నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురముచేయు
దును
యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను.
10భక్తిహీనుల కొమ్ములనన్నిటిని నేను విరుగగొట్టెదను
నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 75: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి