కీర్తనలు 74:12-17

కీర్తనలు 74:12-17 TELUBSI

పురాతనకాలము మొదలుకొని దేవుడు నా రాజై యున్నాడు దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. నీ బలముచేత సముద్రమును పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగుల గొట్టితివి. మకరముయొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టి తివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక జేసితివి పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించినవాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి.