దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొఱ్ఱెలమీద నీ కోపము పొగరాజు చున్నదేమి? నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపా దించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపక మునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సీయోను పర్వతమును జ్ఞాపక మునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడుచేసియున్నారు నిత్యము పాడైయుండు చోట్లకు విజయము చేయుము. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు విజయధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు దట్టమైన చెట్ల గుబురుమీద జనులు గొడ్డండ్ల నెత్తి నట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరుగగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామమందిరమును నేల పడగొట్టి అపవిత్ర పరచు దురు. –దేవుని మందిరములను బొత్తిగా అణగద్రొక్కుద మనుకొని దేశములోని వాటినన్నిటిని వారు కాల్చియున్నారు. సూచకక్రియలు మాకు కనబడుటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగినవాడు మాలో ఎవడును లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు? శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా? నీ హస్తమును నీ దక్షిణహస్తమును నీవెందుకు ముడుచు కొని యున్నావు? నీ రొమ్ములోనుండి దాని తీసి వారిని నిర్మూలము చేయుము.
చదువండి కీర్తనలు 74
వినండి కీర్తనలు 74
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 74:1-11
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు