దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమునుగూర్చియు పుట్టబోవువారికందరికి నీ శౌర్యమునుగూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునైయుండు వరకు నన్ను విడువకుము. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటియైన వాడెవడు? అనేకమైన కఠినబాధలను మాకు కలుగజేసినవాడా, నీవు మరల మమ్ము బ్రదికించెదవు భూమియొక్క అగాధ స్థలములలోనుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధిచేయుము నాతట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము నా దేవా, నేను కూడ నీ సత్యమునుబట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించె దను. నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడుచేయజూచువారు సిగ్గుపడియున్నారువారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును.
చదువండి కీర్తనలు 71
వినండి కీర్తనలు 71
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 71:17-24
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు