కీర్తనలు 41:1-6

కీర్తనలు 41:1-6 TELUBSI

బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును వానిశత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. –యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసి యున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాట లాడుచున్నారు –వాడు ఎప్పుడు చచ్చును? వాని పేరు ఎప్పుడు మాసిపోవును? అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చినయెడల వాడు అబద్ధ మాడును వాని హృదయము పాపమును పోగుచేసికొనుచున్నది. వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు.