కీర్తనలు 32:3-7

కీర్తనలు 32:3-7 TELUBSI

నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా.) నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని –యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు కొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. (సెలా.) కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు. నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు