కీర్తనలు 31:9-18

కీర్తనలు 31:9-18 TELUBSI

యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము విచారమువలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించుచున్నవి నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా యెముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికి నేను నిందాస్పదుడనైయున్నాను నా పొరుగువారికి విచారకారణముగా ఉన్నాను నా నెళవరులకు భీకరుడనై యున్నాను వీధిలో నన్ను చూచువారు నాయెదుటనుండి పారి పోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని ఓటికుండవంటి వాడనైతిని. అనేకులు నామీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారువారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీయందు నమ్మిక యుంచియున్నాను –నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి. నా శత్రువుల చేతిలోనుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారినుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొఱ్ఱపెట్టియున్నాను నన్ను సిగ్గు నొందనియ్యకుము భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక; పాతాళమునందువారు మౌనులైయుందురు గాక. అబద్ధికుల పెదవులు మూయబడును గాక.వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతి మంతులమీద కఠోరమైన మాటలు పలుకుదురు.