కీర్తనలు 137

137
1బబులోను నదులయొద్ద కూర్చుండియున్నప్పుడు
మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చు
చుంటిమి.
2వాటిమధ్యనున్న నిరవంజిచెట్లకు మన సితారాలు
తగిలించితిమి.
3అచ్చట మనలను చెరగొన్నవారు–ఒక కీర్తనపాడుడి
అనిరి
మనలను బాధించినవారు
–సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి
అని మనవలన ఉల్లాసము గోరిరి
4అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు
పాడుదుము?
5యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల
నా కుడిచేయి తన నేర్పు మరచును గాక.
6నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడల,
నా ముఖ్య సంతోషముకంటె
నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనియెడల
నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక.
7యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము
చేసికొనుము
యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు
తెచ్చుకొనుము.
–దానిని నాశనముచేయుడి
సమూలధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా.
8పాడు చేయబడబోవు బబులోను కుమారీ,
నీవు మాకు చేసిన క్రియలనుబట్టి నీకు ప్రతికారము
చేయువాడు ధన్యుడు
9నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకువేసి కొట్టు
వాడు ధన్యుడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 137: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి