కీర్తనలు 106:43-48

కీర్తనలు 106:43-48 TELUBSI

అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగు బాటు చేయుచువచ్చిరి. తమ దోషముచేత హీనదశనొందిరి. అయినను వారిరోదనము తనకు వినబడగావారికి కలిగినశ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారికందరికివారియెడల కనికరము పుట్టించెను. యెహోవా మాదేవా, మమ్మును రక్షింపుము మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును నిన్ను స్తుతించుచు మేమతిశయించునట్లును అన్యజనులలోనుండి మమ్మును పోగుచేయుము. ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినొందును గాక ప్రజలందరు–ఆమేన్ అందురుగాక. యెహోవాను స్తుతించుడి.