వారు తమ దండు పాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మ్రింగెను అది అబీరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. అప్పుడు ఆయన–నేను వారిని నశింపజేసెదననెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి యెహోవా మాట ఆలకింపకవారు తమ గుడారములో సణుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారిమీద చెయ్యి యెత్తెను. మరియు వారు బయల్పెయోరును హత్తుకొని, చచ్చినవారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియలచేత ఆయనకు కోపము పుట్టించగావారిలో తెగులు రేగెను. ఫీనెహాసు లేచి పరిహారముచేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. మెరీబా జలములయొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను.
చదువండి కీర్తనలు 106
వినండి కీర్తనలు 106
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 106:16-33
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు