సంఖ్యాకాండము 24:15-17

సంఖ్యాకాండము 24:15-17 TELUBSI

ఉపమానరీతిగా ఇట్లనెను– బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినిన వాని వార్త మహోన్నతుని విద్య నెరిగినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నానుగాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నానుగాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.