సంఖ్యాకాండము 24

24
1ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలిసికొనినప్పుడు అతడుమునుపటివలె శకునములను చూచుటకు వెళ్లక అరణ్యమువైపు తన ముఖమును త్రిప్పుకొనెను. 2బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమతమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతనిమీదికి వచ్చెను 3గనుక అతడు ఉపమానరీతిగా ఇట్లనెను–
బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి
కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి.
4దేవవాక్కులను వినినవాని వార్త.
అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై#24:4 కన్నులు మూసినవాడై.
సర్వశక్తుని దర్శనము పొందెను.
5యాకోబూ, నీ గుడారములు
ఇశ్రాయేలూ, నీ నివాసస్థలములు
ఎంతో రమ్యమైనవి.
6వాగులవలె అవి వ్యాపించియున్నవి
నదీతీరమందలి తోటలవలెను యెహోవా నాటిన అగరు చెట్లవలెను
నీళ్లయొద్దనున్న దేవదారు వృక్షములవలెను అవి యున్నవి.
7నీళ్లు అతని బొక్కెనలనుండి కారును
అతని సంతతి బహు జలములయొద్ద నివసించును
అతనిరాజు అగగుకంటె గొప్పవాడగును
అతని రాజ్యము అధికమైనదగును.
8దేవుడు ఐగుప్తులోనుండి అతని రప్పించెను
గురుపోతు వేగమువంటి వేగము అతనికి కలదు
అతడు తన శత్రువులైన జనులను భక్షించునువారి యెముకలను విరుచును
తన బాణములతో వారిని గుచ్చును.
9సింహమువలెను ఆడుసింహమువలెను
అతడు క్రుంగి పండుకొనెను
అతనిని లేపువాడెవడు?
నిన్ను దీవించువాడు దీవింపబడును
నిన్ను శపించువాడు శపింపబడును.
10అప్పుడు బాలాకు కోపము బిలాముమీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో–నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్లుము. 11నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదనని చెప్పితినిగాని యెహోవా నీవు ఘనత పొందకుండ ఆటంకపరచెననెను. 12అందుకు బిలాము బాలాకుతో–బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను నా యిష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. 13యెహోవా యేమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నాయొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? 14చిత్తగించుము; నేను నా జనులయొద్దకు వెళ్లుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచెదను రమ్మని చెప్పి 15ఉపమానరీతిగా ఇట్లనెను–
బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి.
కన్నులు తెరచినవానికి#24:15 కన్నులు మూసినవానికి. వచ్చిన దేవోక్తి.
16దేవవాక్కులను వినిన వాని వార్త
మహోన్నతుని విద్య నెరిగినవాని వార్త.
అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై
సర్వశక్తుని దర్శనము పొందెను.
17ఆయనను చూచుచున్నానుగాని
ప్రస్తుతమున నున్నట్టు కాదు
ఆయనను చూచుచున్నానుగాని
సమీపమున నున్నట్టు కాదు
నక్షత్రము యాకోబులో ఉదయించును
రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును
అది మోయాబు ప్రాంతములను కొట్టును
కలహవీరులనందరిని నాశనము చేయును.
18ఎదోమును శేయీరును ఇశ్రాయేలుకు శత్రువులువారు స్వాధీనపరచబడుదురు
ఇశ్రాయేలు పరాక్రమమొందును.
19యాకోబు సంతానమున యేలిక పుట్టును.
అతడు పట్టణములోని శేషమును నశింపజేయును.
20మరియు అతడు అమాలేకీయులవైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను –
అమాలేకు అన్యజనములకు మొదలు
వాని అంతము నిత్యనాశనమే.
21మరియు అతడు కేనీయులవైపు చూచి ఉపమానరీతిగా ఇట్లనెను –
నీ నివాసస్థలము దుర్గమమైనది.
నీ గూడు కొండమీద కట్టబడియున్నది.
22అష్షూరు నిన్ను చెరగా పట్టువరకు
కయీను నశించునా?
23మరియు అతడు ఉపమానరీతిగా–
అయ్యో దేవుడు ఇట్లు చేయునప్పుడు ఎవడు బ్రదుకును?
24కిత్తీము తీరమునుండి ఓడలు వచ్చును.
అవి అష్షూరును ఏబెరును బాధించును.
కిత్తీయులు కూడ నిత్యనాశనము పొందుదురనెను.
25అంతట బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్లెను; బాలాకును తన త్రోవను వెళ్లెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యాకాండము 24: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి