ఉదయముకాగానే ప్రధానయాజకులును పెద్ద లును శాస్త్రులును మహాసభవారందరును కలిసి ఆలోచనచేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు–యూదులరాజవు నీవేనా? అని ఆయన నడుగగా ఆయన–నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరల–నీవు ఉత్తర మేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్య పడెను. ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు. అధికారుల నెదిరించి, కలహములో నరహత్య చేసినవారితోకూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడివచ్చి, అతడు అదివరకు తమకు చేయుచువచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా ప్రధానయాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలిసికొని–నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా? అని అడిగెను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనునట్లు ప్రధానయాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు–ఆలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరల వారి నడిగెను. వారు–వానిని సిలువవేయుమని మరల కేకలువేసిరి. అందుకు పిలాతు–ఎందుకు? అతడే చెడుకార్యము చేసె నని వారి నడుగగా వారు–వానిని సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను. అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోపలికి తీసికొనిపోయి, సైనికులనందరిని సమకూర్చుకొనినతరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తలమీదపెట్టి, –యూదులరాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తలమీదకొట్టి, ఆయనమీద ఉమ్మివేసి, మోకాళ్లూని ఆయనకు నమస్కారముచేసిరి. వారు ఆయనను అపహసించిన తరు వాత ఆయనమీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువవేయుటకు తీసికొనిపోయిరి.
Read మార్కు 15
వినండి మార్కు 15
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 15:1-20
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు