మార్కు 14:66-72

మార్కు 14:66-72 TELUBSI

పేతురు ముంగిటి క్రిందిభాగములో ఉండగా ప్రధానయాజకుని పనికత్తెలలో ఒకతె వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను; అతనిని నిదానించి చూచి –నీవును నజరేయుడగు ఆ యేసుతోకూడ ఉండినవాడవు కావా? అనెను. అందుకతడు–ఆయన ఎవడో నేనెరు గను; నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్లెను; అంతట కోడి కూసెను. ఆ పనికత్తె అతనిని చూచి–వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్న వారితో మరల చెప్పసాగెను. అతడు మరల–నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచి–నిజముగా నీవు వారిలో ఒకడవు; నీవు గలిలయుడవు గదా అనిరి. అందుకతడు–మీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరుగనని చెప్పి, శపించుకొనుటకును ఒట్టుబెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే రెండవమారు కోడికూసెను గనుక–కోడి రెండు మారులు కూయకమునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను.