YouVersion Logo
Search Icon

మత్తయి 5:1, 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20

మత్తయి 5:1 TELUBSI

ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యు లాయనయొద్దకు వచ్చిరి.

మత్తయి 5:2 TELUBSI

అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను

మత్తయి 5:3 TELUBSI

ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.

మత్తయి 5:4 TELUBSI

దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.

మత్తయి 5:6 TELUBSI

నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.

మత్తయి 5:7 TELUBSI

కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.

మత్తయి 5:8 TELUBSI

హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.

మత్తయి 5:9 TELUBSI

సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారు లనబడుదురు.

మత్తయి 5:10 TELUBSI

నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.

మత్తయి 5:11 TELUBSI

నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.

మత్తయి 5:12 TELUBSI

సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగునవారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.

మత్తయి 5:13 TELUBSI

మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.

మత్తయి 5:14 TELUBSI

మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు.

మత్తయి 5:15 TELUBSI

మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు.

మత్తయి 5:16 TELUBSI

మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.

మత్తయి 5:17 TELUBSI

ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.

మత్తయి 5:18 TELUBSI

ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

మత్తయి 5:19 TELUBSI

కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును.

మత్తయి 5:20 TELUBSI

శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.