వారాయనను పెట్టి యీడ్చుకొనిపోయి ప్రధానయాజకుని యింటిలోనికి తీసికొనిపోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతట కొందరు నడుముంగిట మంటవేసి చుట్టు కూర్చుండినప్పుడు, పేతురును వారిమధ్యను కూర్చుండెను. అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరిచూచి–వీడును అతనితోకూడ ఉండెనని చెప్పెను. అందుకు పేతురు–అమ్మాయీ, నేనతని నెరుగననెను. మరి కొంత సేపటికి మరియొకడు అతని చూచి–నీవును వారిలో ఒకడవనగా పేతురు– ఓయీ, నేను కాననెను. ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడు–నిజముగా వీడును అతనితోకూడ ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు–ఓయీ, నీవు చెప్పినది నాకు తెలియ దనెను. అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురువైపు చూచెను గనుక పేతురు–నేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొని వెలుపలికిపోయి సంతాపపడి యేడ్చెను. యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి, ఆయన ముఖము కప్పి, –నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. ఉదయముకాగానే ప్రజల పెద్దలును ప్రధానయాజకులును శాస్త్రులును సభకూడి, ఆయనను తమ మహా సభలోనికి తీసికొనిపోయి –నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకాయన – నేను మీతో చెప్పినయెడల మీరు నమ్మరు. అదియుగాక నేను మిమ్మును అడిగినయెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. అందుకు వారందరు–అట్లయితే నీవు దేవుని కుమారుడవా? అని అడుగగా ఆయన–మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను. అందుకు వారు–మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటిమాట వింటిమిగదా అని చెప్పిరి.
చదువండి లూకా 22
వినండి లూకా 22
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లూకా 22:54-71
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు