లూకా 22:1-6

లూకా 22:1-6 TELUBSI

పస్కా అనబడిన పులియనిరొట్టెల పండుగ సమీ పించెను. ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఏలాగు చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి. అంతట పండ్రెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్లి, ఆయనను వారికేలాగు అప్పగింపవచ్చునో దానినిగూర్చి ప్రధానయాజకులతోను అధిపతులతోను మాటలాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని, జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను.