YouVersion Logo
Search Icon

లూకా 18:1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29-30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43

లూకా 18:1 TELUBSI

వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె . ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.

లూకా 18:2 TELUBSI

–దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక పట్టణములో ఉండెను.

లూకా 18:3 TELUBSI

ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతనియొద్దకు తరచుగావచ్చి–నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని

లూకా 18:4 TELUBSI

అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు–నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను

లూకా 18:5 TELUBSI

ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనెను.

లూకా 18:6 TELUBSI

మరియు ప్రభువిట్లనెను–అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి.

లూకా 18:7 TELUBSI

దేవుడు తాను ఏర్పరచుకొనినవారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా?

లూకా 18:8 TELUBSI

ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారివిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?

లూకా 18:9 TELUBSI

తామే నీతిమంతులని తమ్మునమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను.

లూకా 18:10 TELUBSI

–ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి.

లూకా 18:11 TELUBSI

పరిసయ్యుడు నిలువబడి–దేవా, నేను చోరులును అన్యా యస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

లూకా 18:12 TELUBSI

వారమునకు రెండు మారులు ఉప వాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను.

లూకా 18:13 TELUBSI

అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచు–దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.

లూకా 18:14 TELUBSI

అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను.

లూకా 18:15 TELUBSI

తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయనయొద్దకు వారిని తీసికొనిరాగా ఆయన శిష్యులు అది చూచి తీసి కొనివచ్చిన వారిని గద్దించిరి.

లూకా 18:16 TELUBSI

అయితే యేసు వారిని తనయొద్దకు పిలిచి–చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటివారిది.

లూకా 18:17 TELUBSI

చిన్న బిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

లూకా 18:19 TELUBSI

అందుకు యేసు–నేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు.

లూకా 18:20 TELUBSI

వ్యభిచరింప వద్దు, నరహత్యచేయ వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తలి దండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను.

లూకా 18:21 TELUBSI

అందుకతడు–బాల్యమునుండి వీటినన్నిటిని అనుసరించుచునే యున్నాననెను.

లూకా 18:22 TELUBSI

యేసు విని–నీకింక ఒకటి కొదువగా నున్నది; నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను.

లూకా 18:23 TELUBSI

అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా

లూకా 18:24 TELUBSI

యేసు అతని చూచి –ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము.

లూకా 18:25 TELUBSI

ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె సూదిబెజ్జములో ఒంటెదూరుట సులభమని చెప్పెను.

లూకా 18:26 TELUBSI

ఇది వినినవారు–ఆలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా

లూకా 18:27 TELUBSI

ఆయన–మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను.

లూకా 18:28 TELUBSI

పేతురు– ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా

లూకా 18:29-30 TELUBSI

ఆయన–దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టినవాడెవడును, ఇహమందు చాలరెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.

లూకా 18:31 TELUBSI

ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి–ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెర వేర్చబడును.

లూకా 18:32 TELUBSI

ఆయన అన్యజనుల కప్పగింపబడును; వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయనమీద ఉమ్మి వేసి

లూకా 18:33 TELUBSI

ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు; మూడవదినమున ఆయన మరల లేచునని చెప్పెను.

లూకా 18:34 TELUBSI

వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు; ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు.

లూకా 18:35 TELUBSI

ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవప్రక్కను కూర్చుండి భిక్షమడుగుకొను చుండెను.

లూకా 18:36 TELUBSI

జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని–ఇది ఏమని అడుగగా

లూకా 18:37 TELUBSI

వారు–నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్లుచున్నాడని వానితో చెప్పిరి.

లూకా 18:38 TELUBSI

అప్పుడు వాడు–యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా

లూకా 18:39 TELUBSI

–ఊరకుండుమని ముందర నడుచుచుండినవారు వానిని గద్దించిరి గాని, వాడు మరి ఎక్కువగా–దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేసెను.

లూకా 18:40 TELUBSI

అంతట యేసు నిలిచి, వానిని తనయొద్దకు తీసికొని రమ్మనెను.

లూకా 18:41 TELUBSI

వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన–నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా, వాడు–ప్రభువా, చూపు పొందగోరుచున్నాననెను.

లూకా 18:42 TELUBSI

యేసు–చూపుపొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను

లూకా 18:43 TELUBSI

వెంటనే వాడు చూపుపొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరు అది చూచి దేవుని స్తోత్రము చేసిరి.