యెహోవా, అగాధమైన బందీగృహములోనుండి నేను నీ నామమునుబట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా చెవిని మూసికొనకుము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నాయొద్దకు వచ్చితివి –భయపడకుమి అని నీవు చెప్పితివి. ప్రభువా, నీవు నా ప్రాణవిషయమైన వ్యాజ్యెము లను వాదించితివి నా జీవమును విమోచించితివి. యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి యున్నావు నా వ్యాజ్యెము తీర్చుము. పగతీర్చుకొనవలెనని వారు నామీదచేయు ఆలోచన లన్నియు నీవెరుగుదువు.
Read విలాపవాక్యములు 3
వినండి విలాపవాక్యములు 3
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: విలాపవాక్యములు 3:55-60
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు