విలాపవాక్యములు 2

2
1ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో
కప్పియున్నాడు
ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశమునుండి
భూమిమీదికి పడవేసెను
కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము
చేసికొనకపోయెను.
2ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస
స్థలములన్నిటిని నాశనముచేసియున్నాడు
మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి
యున్నాడు వాటిని నేలకు కూల్చివేసియున్నాడు
ఆ రాజ్యమును దాని యధిపతులను ఆయన అపవిత్ర
పరచియున్నాడు.
3కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగ
మును
ఆయన విరుగగొట్టియున్నాడు
శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు
తీసియున్నాడు
నఖముఖాల దహించు అగ్నిజ్వాలలు కాల్చునట్లు
ఆయన యాకోబును కాల్చివేసి యున్నాడు.
4శత్రువువలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధివలె కుడి
చెయ్యి చాపియున్నాడు
కంటికి అందమైన వస్తువులన్నిటిని నాశనముచేసి
యున్నాడు
అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను
సీయోను కుమార్తె గుడారములమీద కుమ్మరించి
యున్నాడు.
5ప్రభువు శత్రువాయెను
ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు
దాని నగరులన్నిటిని నాశనముచేసియున్నాడు
దాని కోటలను పాడుచేసియున్నాడు
యూదా కుమారికి అధిక దుఃఖప్రలాపములను ఆయన
కలుగజేసియున్నాడు.
6ఒకడు తోటను కొట్టివేయునట్లు
తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి
యున్నాడు
తన సమాజస్థలమును నాశనము చేసియున్నాడు
యెహోవా సీయోనులో నియామక కాలము
విశ్రాంతిదినము
మరువబడునట్లు చేసియున్నాడు
కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి
యున్నాడు.
7ప్రభువు తన బలిపీఠము విడనాడెను
తన పరిశుద్ధస్థలమునందు అసహ్యించుకొనెను
దాని నగరుల ప్రాకారములను శత్రువులచేతికి అప్ప
గించెనువారు నియామక కాలమున జనులు చేయునట్లు
యెహోవామందిరమందు ఉత్సాహధ్వని చేసిరి.
8సీయోను కుమారియొక్క ప్రాకారములను పాడు
చేయుటకు యెహోవా ఉద్దేశించెను
నాశనముచేయుటకు తన చెయ్యి వెనుకతీయక
ఆయన కొలనూలు సాగలాగెను.
ప్రహరియు ప్రాకారమును దీనిగూర్చి మూల్గుచున్నవి
అవి యేకరీతిగా క్షీణించుచున్నవి.
9పట్టణపు గవునులు భూమిలోనికి క్రుంగిపోయెను
దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి పాడు
చేసెను
దాని రాజును అధికారులును అన్యజనులలోనికి పోయియున్నారు
అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను
యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుట
లేదు.
10సీయోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు
తలలమీద బుగ్గి పోసికొందురు గోనెపట్ట కట్టు
కొందురు
యెరూషలేము కన్యకలు నేలమట్టుకు తలవంచు
కొందురు.
11నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా
నా కన్నులు కన్నీటిచేత క్షీణించుచున్నవి
నా యంతరంగము క్షోభిల్లుచున్నది
నా కాలేజము నేలమీద ఒలుకుచున్నది.
శిశువులును చంటిబిడ్డలును పట్టణపు వీధులలో
మూర్ఛిల్లెదరు.
12గాయమొందినవారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు
తల్లుల రొమ్ము నానుకొని–అన్నము ద్రాక్షారసము
ఏదియని తమ తల్లుల నడుగుచు ప్రాణము విడిచె
దరు.
13యెరూషలేము కుమారీ, ఎట్టిమాటలచేత నిన్ను హెచ్చ
రించుదును?
దేనితో నిన్ను సాటిచేయుదును?
సీయోను కుమారీ, కన్యకా,
నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును?
నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది
నిన్ను స్వస్థపరచగలవాడెవడు?
14నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థదర్శనములు చూచియున్నారు
నీవు చెరలోనికి పోకుండ తప్పించుటకైవారు నీ దోషములను నీకు వెల్లడిచేయలేదు.వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి
త్రోవతప్పించు దర్శనములు చూచినవారైరి.
15త్రోవను వెళ్లువారందరు నిన్ను చూచి చప్పట్లు
కొట్టెదరువారు యెరూషలేము కుమారిని చూచి
–పరిపూర్ణ సౌందర్యముగల పట్టణమనియు
సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరియనియు
జనులు ఈ పట్టణమునుగూర్చియేనా చెప్పిరి?
అని యనుకొనుచు గేలిచేసి తల ఊచెదరు
16నీ శత్రువులందరు నిన్ను చూచి నోరు తెరచెదరువారు ఎగతాళిచేసి పండ్లు కొరుకుచు
–దాని మ్రింగివేసియున్నాము
ఇదేగదా మనము కనిపెట్టినదినము
అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము
అని యనుకొనెదరు.
17యెహోవా తాను యోచించిన కార్యము ముగించి
యున్నాడు
పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి
యున్నాడు
శేషములేకుండ నిన్ను పాడుచేసియున్నాడు
నిన్నుబట్టి శత్రువులు సంతోషించునట్లు చేసి
యున్నాడు
నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు.
18జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొఱ్ఱ
పెట్టుదురు.
సీయోను కుమారి ప్రాకారమా,
నదీప్రవాహమువలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము
విరామము కలుగనియ్యకుము
నీ కంటిపాపను విశ్రమింపనియ్యకుము.
19నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము
నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయ
మును కుమ్మరించుము
నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీచేతులను ఆయన
తట్టు ఎత్తుము
ప్రతి వీధిమొగను అకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు
20నీవు ఎవనియెడల ఈ ప్రకారము చేసితివో
యెహోవా, దృష్టించి చూడుము.
తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసి
పిల్లలను స్త్రీలు భక్షించుట తగునా?
యాజకుడును ప్రవక్తయు ప్రభువుయొక్క పరి
శుద్ధాలయమునందు హతులగుట తగునా?
21యౌవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు
నా కన్యకలును నా యౌవనులును ఖడ్గముచేత కూలియున్నారు
నీ ఉగ్రతదినమున నీవు వారిని హతము చేసితివి
దయ తలచక వారినందరిని వధించితివి.
22ఉత్సవదినమున జనులు వచ్చునట్లుగా
నలుదిశలనుండి నీవు నామీదికి భయోత్పాతములను
రప్పించితివి.
యెహోవా ఉగ్రతదినమున ఎవడును తప్పించుకొనలేక
పోయెను
శేషమేమియు నిలువకపోయెను
నేను చేతులలో ఆడించి సాకినవారిని శత్రువులు
హరించివేసియున్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

విలాపవాక్యములు 2: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి