అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది? అది సజీవులందరి కన్నులకు మరుగై యున్నది ఆకాశపక్షులకు మరుగుచేయబడి యున్నది. మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశన మును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును. ఆయన భూమ్యంతములవరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతోకూడిన మెరుపునకు మార్గము ఏర్పరచినప్పుడు ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని పరిశోధించెను. మరియు–యెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.
Read యోబు 28
వినండి యోబు 28
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోబు 28:20-28
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు