యోబు 23
23
1అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను–
2నేటివరకు నేను మొరలిడుచు తిరుగుబాటుచేయు
చున్నాను
నా వ్యాధి నా మూలుగుకంటె భారముగా నున్నది
3ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా
ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియ
బడును గాక.
4ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశద
పరచెదను
వాదములతో నా నోరు నింపుకొనెదను.
5ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది
నేను తెలిసికొందును
ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును.
6ఆయన తన అధికబలముచేత నాతో వ్యాజ్యెమాడునా?
ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును
7అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడ
వచ్చును.
కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతివలన
శిక్ష నొందకపోవుదును.
8నేను తూర్పుదిశకు వెళ్లినను ఆయన అచ్చట లేడు
పడమటిదిశకు వెళ్లినను ఆయన కనబడుట లేదు
9ఆయన పనులు జరిగించు ఉత్తరదిశకు పోయినను
ఆయన నాకు కానవచ్చుట లేదు
దక్షిణదిశకు ఆయన ముఖము త్రిప్పుకొనియున్నాడు
నేనాయనను కనుగొనలేను.
10నేను నడచుమార్గము ఆయనకు తెలియును
ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె
కనబడుదును.
11నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక
నడచినవి
నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నను
సరించితిని.
12ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు
ఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె
ఎక్కువగా ఎంచితిని.
13అయితే ఆయన ఏకమనస్సుగలవాడు ఆయనను మార్చగలవాడెవడు?
ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును.
14నాకు విధింపబడినదానిని ఆయన నెరవేర్చును
అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై
యున్నాడు.
15కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను
నేను ఆలోచించునప్పుడెల్ల ఆయనకు భయపడు
చున్నాను.
16దేవుడు నా హృదయమును క్రుంగజేసెను, సర్వశక్తుడే
నన్ను కలవరపరచెను.
17అంధకారము కమ్మియుండినను గాఢాంధకారము నన్ను
కమ్మియుండినను
నేను నాశనముచేయబడి యుండలేదు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 23: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.