యోబు 14

14
1స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై#14:1 కించిదాయుష్షుగలవాడై. మిక్కిలి
బాధనొందును.
2పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును#14:2 కోయబడును.
నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.
3అట్టివానిమీద నీవు కనుదృష్టి యుంచియున్నావు
తీర్పు నొందుటకై నన్ను నీ యెదుటికి రప్పించి
యున్నావు.
4పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టగలిగిన
ఎంత మేలు?
ఆలాగున ఎవడును పుట్టనేరడు.
5నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల
సంఖ్య నీకు తెలిసేయున్నది.
మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించియున్నావు
6కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు
ముగించువరకువారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడక
యుండుము.
7వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియు
దానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముకలదు.
8దాని వేరు భూమిలో పాతదై పోయినను
దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను
9నీటి వాసనమాత్రముచేత అది చిగుర్చును
లేత మొక్కవలె అది కొమ్మలు వేయును.
10అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు.
నరులు ప్రాణము విడిచినతరువాత వారేమై పోవుదురు?
11తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో
నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో
12ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు.
ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు.
ఎవరును వారిని నిద్ర లేపజాలరు.
13నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతో
మేలు
నీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచిన
యెడల ఎంతో మేలు
నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను
జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరు
చున్నాను.
14మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?
ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు
నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును
15ఆలాగుండినయెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను
నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.
16అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు
నా పాపమును సహింపలేకయున్నావు
17నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది
నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు.
18పర్వతమైనను పడిపోయి నాశనమగును
కొండయైనను దాని స్థానము తప్పును.
19జలము రాళ్లను అరగదీయును
దాని ప్రవాహములు భూమియొక్క ధూళిని కొట్టు
కొనిపోవును
నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు.
20నీవు వారిని ఎల్లప్పుడు గెలుచుచున్నావు గనుక వారు
గతించిపోవుదురు
నీవు వారికి ముఖవికారము కలుగజేసి వారిని వెళ్ల
గొట్టుచున్నావు.
21వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అదివారికి తెలియకపోవును.వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి
పట్టెనని వారు గ్రహింపకయుందురు.
22తమమట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు
తమమట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 14: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి