యోహాను 6:16-21

యోహాను 6:16-21 TELUBSI

సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపుటద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి; అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను. కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.