హెబ్రీయులకు 5

5
1ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, పాపములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యులనిమిత్తము నియమింపబడును. 2తాను కూడ బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమియు తెలియనివారియెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు. 3ఆ హేతువుచేత ప్రజల కొరకేలాగో ఆలాగే తనకొరకును పాపములనిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు. 4మరియు ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనతపొందును. 5అటువలె క్రీస్తు కూడ ప్రధానయాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని
–నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను
అని ఆయనతో చెప్పినవాడే అయనను మహిమపరచెను. 6ఆప్రకారమే
–నీవు మెల్కీసెదెకుయొక్క క్రమము చొప్పున
నిరంతరము యాజకుడవై యున్నావు
అని మరియొకచోట చెప్పుచున్నాడు. 7శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులుకలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను. 8ఆయన, కుమారుడైయుండియు తాను పొందినశ్రమలవలన విధేయతను నేర్చుకొనెను. 9-10మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.
11ఇందునుగూర్చి#5:11 లేక, ఇతనిగూర్చి. మేము చెప్పవలసినవి అనేక సంగతు లున్నవి గాని, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. 12కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింప వలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారేగాని బలమైన ఆహారము తినగలవారుకారు. 13మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువేగనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు. 14వయస్సు వచ్చినవారు#5:14 లేక, పరిపూర్ణులు. అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

హెబ్రీయులకు 5: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి