హెబ్రీయులకు 10:1-4

హెబ్రీయులకు 10:1-4 TELUBSI

ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగల . దియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆయాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. ఆలాగు చేయగలిగినయెడల సేవించువారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞిప్త ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. అయితే ఆ బలులు అర్పించుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.