ఆదికాండము 50:17-20

ఆదికాండము 50:17-20 TELUBSI

–నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించిన దేమనగా–మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఈలాగు మాటలాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని యెదుట సాగిలపడి–ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు–భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడుచేయనుద్దేశించితిరిగాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.

ఆదికాండము 50:17-20 కోసం వీడియో