మహలలేలు అరువదియైదేండ్లు బ్రదికి యెరెదును కనెను. యెరెదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పదియేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నియు ఎనిమిదివందల తొంబదియైదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. యెరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను. హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిది వందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. యెరెదు దినములన్నియు తొమ్మిదివందల అరువదిరెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. హనోకు అరువదియైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను. మెతూషెల నూట ఎనుబదియేడేండ్లు బ్రదికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమారుని కని –భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. లెమెకు నోవహును కనిన తరువాత ఐనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.
Read ఆదికాండము 5
వినండి ఆదికాండము 5
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆదికాండము 5:15-32
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు