ఇశ్రాయేలు యోసే పుతో–నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదుగాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరచియున్నాడనగా యోసేపు అతని మోకాళ్లమధ్యనుండి వారిని తీసికొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతితట్టున తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతితట్టున తన యెడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసికొనివచ్చెను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తలమీద తన కుడిచేతిని మనష్షే తలమీద తన యెడమచేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి–నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవనియెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందువారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను.
చదువండి ఆదికాండము 48
వినండి ఆదికాండము 48
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆదికాండము 48:11-16
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు