మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయులమీద రాజ్య పరిపాలన చేయకమునుపు, ఎదోము దేశములో రాజ్యపరి పాలన చేసినరాజు లెవరనగా బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్యపరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా బెల చనిపోయిన తరువాత బొస్రా వాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తేమా నీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మశ్రేకావాడైన శవ్లూ అతనికి ప్రతిగా రాజాయెను. శవ్లూ చనిపోయిన తరువాత నదీతీరమందలి రహెబోతువాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయెను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్ హానాను అతనికి ప్రతిగా రాజాయెను. అక్బోరు కుమారుడైన బయల్ హానాను చనిపోయినతరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు కుమార్తె మరియు వారివారి వంశముల ప్రకారము వారివారి స్థలములలో వారివారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరు లేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు అహొలీబామా నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు కనజు నాయకుడు తేమాను నాయకుడు మిబ్సారు నాయకుడు మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమతమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూలపురుషుడు.
Read ఆదికాండము 36
వినండి ఆదికాండము 36
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆదికాండము 36:31-43
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు