ఆదికాండము 36:20-30

ఆదికాండము 36:20-30 TELUBSI

ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు, లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దీషాను. వీరు ఎదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ హేమీము; లోతాను సహోదరి తిమ్నా శోబాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా; ఆ అనా తన తండ్రియైన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనినవాడు. అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా. దిషోను కుమారులు హెవ్దూను ఎష్బాను ఇత్రాను కెరాను ఏసెరు కుమారులు బిల్హాను జవాను అకాను. దీషాను కుమారులు ఊజు అరాను. హోరీయుల నాయకులు, లోతాను నాయకుడు శోబాలు నాయకుడు సిబ్యోను నాయకుడు అనా నాయకుడు దిషోను నాయకుడు ఏసెరు నాయకుడు దీషాను నాయకుడు. శేయీరు దేశమందలి వారి నాయ కుల చొప్పున వీరు హోరీయుల నాయకులు.

ఆదికాండము 36:20-30 కోసం వీడియో