మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్ని టికిని కర్తయైయున్నను బాలుడైయున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రిచేత నిర్ణయింప బడిన దినము వచ్చువరకు అతడు సంరక్షకులయొక్కయు గృహనిర్వాహకులయొక్కయు అధీనములో ఉండును. అటువలె మనమును బాలురమై యున్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై యుంటిమి; అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి, మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను. మరియు మీరు కుమారులై యున్నందున–నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మ ను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవునిద్వారా వారసుడవు.
చదువండి గలతీయులకు 4
వినండి గలతీయులకు 4
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: గలతీయులకు 4:1-7
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు