యెహెజ్కేలు 28:1-5

యెహెజ్కేలు 28:1-5 TELUBSI

మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. –నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–గర్విష్ఠుడవై–నే నొక దేవతను, దేవతనైనట్టు సముద్రముమధ్యను నేను ఆసీనుడనై యున్నాను అని నీవనుకొనుచున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభి ప్రాయము కలిగియున్నావు, నీవు దానియేలునకంటె జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనదేదియు లేదు. నీ జ్ఞానముచేతను నీ వివేకముచేతను ఐశ్వర్యమునొందితివి, నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయముచేతను వర్తకముచేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించినవాడవైతివి.

యెహెజ్కేలు 28:1-5 కోసం వీడియో