ద్వితీయోపదేశకాండము 8:6-9

ద్వితీయోపదేశకాండము 8:6-9 TELUBSI

ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలోనుండియు కొండలలోనుండియు పారు ఊటలును అగాధజలములునుగల దేశము. అది గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపుచెట్లు దానిమ్మపండ్లునుగల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరవు అనుకొనకుండ నీవు ఆహారము తిను దేశము; అందులో నీకు ఏ లోపముండదు. అది యినుపరాళ్లు గల దేశము; దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును.