ద్వితీయోపదేశకాండము 11:24-25
ద్వితీయోపదేశకాండము 11:24-25 TELUBSI
మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును. ఏ మనుష్యుడును మీ యెదుట నిలువడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటిమీద మీ బెదురు మీ భయము పుట్టించును.