అపొస్తలుల కార్యములు 26:24-32

అపొస్తలుల కార్యములు 26:24-32 TELUBSI

అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు–పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతి విద్యవలన నీకు వెఱ్ఱిపెట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను. అందుకు పౌలు ఇట్లనెను–మహాఘనత వహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులెరుగును గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను; వాటిలో ఒకటియు అతనికి మరుగైయుండ లేదని రూఢిగా నమ్ముచున్నాను; ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును. అందుకు అగ్రిప్ప–ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను. అందుకు పౌలు–సులభముగానో దుర్లభము గానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను. అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితోకూడ కూర్చుండినవారును లేచి అవతలకు పోయి –ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగిన దేమియు చేయలేదని తమలోతాము మాటలాడుకొనిరి. అందుకు అగ్రిప్ప–ఈ మనుష్యుడు–కైసరు ఎదుట చెప్పు కొందునని అననియెడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను.

అపొస్తలుల కార్యములు 26:24-32 కోసం వీడియో