1 దినవృత్తాంతములు 12

12
1దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి యింకను దాగియుండగా సౌలు బంధువులగు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతనియొద్దకు సిక్లగునకు వచ్చిరి. 2వీరు విలుకాండ్రయి కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైనవారు. 3వారెవరనగా గిబియావాడైన షెమాయా కుమారులైన అహీయెజెరు, ఇతడు అధిపతి; ఇతని తరువాతివాడగు యోవాషు, అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ, 4ముప్పదిమందిలో పరాక్రమశాలియు ముప్పదిమందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు, 5ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయా, 6కోరహీయులగు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము, 7గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును. 8మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములుగలవారు, కొండలలోనుండు జింకలంతపాద వేగము గలవారు. 9వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు, 10నాల్గవవాడు దుష్మన్నా, అయిదవవాడు యిర్మీయా, 11ఆరవవాడు అత్తయి, యేడవవాడు ఎలీయేలు, 12ఎనిమిదవ వాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్జాబాదు, 13పదియవవాడు యిర్మీయా, పదకొండవవాడు మక్బన్నయి. 14గాదీయులగు వీరు సైన్యమునకు అధిపతులై యుండిరి; వారిలో అత్యల్పుడైనవాడు నూరుమందికి అధిపతి, అత్య ధికుడైనవాడు వెయ్యిమందికి అధిపతి, 15యొర్దాను గట్టులమీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పులోయలలోను పడమటిలోయలలోను ఉన్న వారినందరిని తరిమివేసినవారు వీరే. 16మరియు బెన్యామీనీయులలో కొందరును యూదా వారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి. 17దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను–మీరు సమాధానము కలిగి నాకు సహాయముచేయుటకై నాయొద్దకు వచ్చియున్నయెడల నా హృదయము మీతో అతికియుండును; అట్లుగాక నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని యెరిగి యుండియు, నన్ను నా శత్రువులచేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్నయెడల మన పితరులయొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక. 18అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడై–దావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలు కగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. 19సౌలుమీద యుద్ధముచేయబోయిన ఫిలిష్తీయులతోకూడ దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షముచేరిరి; దావీదు ఫిలిష్తీయులకు సహాయము చేయకపోయెను, ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయునని యెంచి ఫిలిష్తీయుల అధికారులు అతని పంపివేసిరి. 20అంతట అతడు సిక్లగునకు తిరిగి పోవుచుండగా మనష్షే సంబంధులైన అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపువారికి అధిపతులు అతని పక్షముచేరిరి. 21వారందరును పరాక్రమశాలులును సైన్యాధిపతులునైయుండిరి; ఆ దండును హతముచేయుటకు వారు దావీదునకు సహాయముచేసిరి. 22దావీదు దండు దేవుని సైన్యమువలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతనియొద్దకు వచ్చుచుండిరి.
23యెహోవా నోటిమాట ప్రకారము సౌలుయొక్క రాజ్యమును దావీదుతట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతనియొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్కయెంతయనగా 24యూదావారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై యున్నవారు ఆరువేల ఎనిమిదివందలమంది. 25షిమ్యోనీయులలో యుద్ధమునకు తగినశూరులు ఏడువేల నూరుమంది. 26లేవీయులలో అట్టివారు నాలుగువేల ఆరువందలమంది. 27అహరోను సంతతివారికి యెహోయాదా అధిపతి, అతనితోకూడ ఉన్నవారు మూడువేల ఏడువందలమంది. 28పరాక్రమశాలియైన సాదోకు అను యౌవనునితోకూడ అతని తండ్రి యింటివారైన అధిపతులు ఇరువదియిద్దరు. 29సౌలు సంబంధులగు బెన్యామీనీయులు మూడువేలమంది; అప్పటివరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు గాపాడుచుండిరి. 30తమపితరుల యింటివారిలో పేరుపొందిన పరాక్రమశాలులు ఎఫ్రా యిమీయులలో ఇరువదివేల ఎనిమిది వందలమంది. 31మనేష్షయొక్క అర్ధగోత్రపువారిలో దావీదును రాజుగా చేయుటకై రావలెనని పేరు పేరుగా నియమింపబడినవారు పదునెనిమిదివేలమంది. 32ఇశ్శాఖారీయులలో సమయో చిత జ్ఞానముకలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు రెండువందలు; వీరి గోత్రపు వారందరును వీరి యాజ్ఞకు బద్ధులైయుండిరి. 33జెబూలూ నీయులలో సకలవిధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగినవారును యుద్ధపు నేర్పుగలవారును మనస్సునందు పొరపులేకుండ యుద్ధము చేయగలవారును ఏబదివేలమంది. 34నఫ్తాలీయులలో వెయ్యిమంది అధిపతులు, వారితోకూడ డాలును ఈటెను పట్టుకొనినవారు ముప్పదియేడువేలమంది. 35దానీయులలో యుద్ధ సన్నద్ధులైనవారు ఇరువది యెనిమిదివేల ఆరు వందలమంది. 36ఆషేరీయులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు నలువది వేలమంది. 37మరియు యొర్దాను నది అవతలనుండు రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకలవిధమైన యుద్ధాయుధములను ధరించిన లక్ష ఇరువది వేల మంది యోధులందరు దావీదును ఇశ్రాయేలుమీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగినవారై హెబ్రోనునకు వచ్చిరి. 38ఇశ్రాయేలులో కడమ వారందరును ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలెనని కోరియుండిరి. 39వారి సహోదరులు వారి కొరకు భోజనపదార్థములను సిద్ధము చేసియుండగా వారు దావీదుతోకూడ అచ్చట మూడుదినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి. 40ఇశ్రాయేలీయులకు సంతో షము కలిగియుండెను గనుక ఇశ్శాఖారు జెబూలూను నఫ్తాలి అనువారి పొలిమేరలవరకు వారికి సమీపమైనవారు గాడిదలమీదను ఒంటెలమీదను కంచరగాడిదలమీదను ఎద్దులమీదను ఆహారవస్తువులైన పిండివంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్షపండ్లగెలలను ద్రాక్షారసమును నూనెను గొఱ్ఱెలను పశువులను విస్తారముగా తీసికొనివచ్చిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 దినవృత్తాంతములు 12: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి