1
యెషయా 35:10
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు. వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు; నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది. వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు. దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి.
సరిపోల్చండి
Explore యెషయా 35:10
2
యెషయా 35:3-4
బలహీనమైన చేతులను బలపరచండి, వణుకుతున్న మోకాళ్లను స్థిరపరచండి; భయపడేవారితో ఇలా అనండి: “ధైర్యంగా ఉండండి, భయపడకండి; మీ దేవుడు వస్తారు ఆయన ప్రతీకారంతో వస్తారు. దైవిక ప్రతీకారంతో ఆయన మిమ్మల్ని రక్షించడానికి వస్తారు.”
Explore యెషయా 35:3-4
3
యెషయా 35:8
అక్కడ రహదారి ఉంటుంది; అది పరిశుద్ధ మార్గమని పిలువబడుతుంది; అది ఆ మార్గంలో నడిచే వారికి మాత్రమే. అపవిత్రులు ఆ దారిలో వెళ్లకూడదు; దుర్మార్గమైన మూర్ఖులు దానిలో నడవరు.
Explore యెషయా 35:8
4
యెషయా 35:5
అప్పుడు గ్రుడ్డివారి కళ్లు తెరవబడతాయి చెవిటి వారి చెవులు వినబడతాయి.
Explore యెషయా 35:5
5
యెషయా 35:6
అప్పుడు కుంటివారు జింకలా గంతులు వేస్తారు, మూగవాని నాలుక ఆనందంతో కేకలు వేస్తుంది. అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి ఎడారిలో కాలువలు పారతాయి.
Explore యెషయా 35:6
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు